రాత్రుళ్లు ఇవి తింటే పీడకలలు వస్తాయట.. పెరుగుతో సహా ఇంకా..

-

మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతాం అన్నది మనం రాత్రి తినే ఆహారం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఏది పడితే అది తింటే నిద్ర సరిగ్గా పట్టదు. ఇంకా తినకూడనివి తింటే..పీడకలలు కూడా వస్తాయట.. వినడానకికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ రాత్రుళ్లు ఏం తినకూడదో చూద్దామా..!

చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో చాలా కెఫిన్ ఉంటుంది. దీంతో.. రాత్రి సమయాల్లో చాక్లెట్ తింటే.. ఇది గాఢ నిద్రను నిరోధిస్తుంది. దీంతో పాటు చాక్లెట్ తింటే అది మీకు అశాంతి, పీడకలల్ని కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

చిప్స్

 ఫ్రాంటియర్స్ ఆఫ్ సైకాలజీ అధ్యయనం ప్రకారం.. చిప్స్ వంటి జిడ్డుగల ఆహారాలలో కనిపించే కొవ్వులు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల రాత్రి నిద్రలో అశాంతి, నిద్ర భంగం, తరచుగా పీడకలలు వస్తాయి

పెరుగు

ఇది మీకు షాకింగ్‌గానే అనిపించవచ్చు.. ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది, శ్వాసకోశ వ్యవస్థను అడ్డుకుంటుంది. మెదడుకు వెళ్లే రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీంతో, నిద్రలేమితో పాటు పీడకలలు వచ్చే ప్రమాదముంది.

బ్రెడ్ పాస్తా

చాలా స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌గా మార్చబడతాయి. ఇవి, చక్కెర ఆహారాల మాదిరిగానే ప్రభావం చూపుతాయి. వీటి వల్ల నిద్రకు ఆటంకాలు, పీడకలలు వస్తాయట.

జున్ను

రాత్రి సమయంలో జున్ను తినకూడదట. జున్నును తింటే నిద్రలో అశాంతిని కలిగిస్తుందని, పీడకలలు వస్తాయని E టైమ్స్ నివేదించింది. జున్నును ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి పూట తినకూడదని బ్రిటీష్ చీజ్ బోర్డ్ పేర్కొంది.

వేడి సాస్

ఎక్కువగా వేడి సాస్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది నిద్ర యొక్క REM (వేగవంతమైన కంటి కదలిక) దశలో కలల రూపాన్ని మారుస్తుంది. దీంతో, పీడకలలకు దారితీస్తుంది.
సో.. ఇలాంటివి రాత్రి తినకపోవడమే మంచిది.. ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని నైట్‌టైంలో దూరం పెట్టడం ఉత్తమం.!

Read more RELATED
Recommended to you

Latest news