ఆదివారంనాడు ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీ దేవి నట్టింట్లో నాట్యం చేస్తుంది..!!

-

లక్ష్మీ దేవి ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు..అందుకే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే కొన్ని నియమాలను పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు..ఇంట్లో వస్తువులు ఎలా ఉండాలో అన్నది వాస్తు శాస్త్రం ప్రకారం చేస్తే మంచిది..ఇప్పుడు లక్ష్మీ దేవి ఇంట్లోకి రావడానికి పాటించాల్సిన 7 నియమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. కలర్స్.. ఇంటి ఎంట్రన్స్ అందంగా ఉండాలి చక్కగా అలంకరించినట్లు ఉండాలి. మెరిసే రంగులతో ఉండాలి. కాంతి బాగా ఉండాలి. చీకటి రంగులు అస్సలు వేసుకోవద్దు..

ముఖ్యంగా గుమ్మం దగ్గర కాంతి లేకపోతే లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టదు. ఆమె బదులుగా దరిద్ర దేవత అడుగుపెడుతుంది..అదే విధంగా అద్దాలు ఎలాంటి పరిస్థితులలోను ఇంటి ముందు ప్రధాన తలుపులకి గ్లాసులు, అద్దాలు లాంటివి పెట్టవద్దు. వాటి ప్రతిక్షేపనం అవుతుంది. అలా అయితే తల్లికి నచ్చదు. అమ్మవారి బదులు దరిద్ర దేవత ఇంట్లోకి అడుగుపెడుతుంది. గడపలు : ఇంటి గడప సరిఅయింది గా ఉండాలి. మరి ఎత్తు ఎక్కువ ఉండకూడదు. అశుభ్రంగా ఉంచుకోకూడదు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తేలిగ్గా వచ్చేలా చూసుకోవాలి అప్పుడే అమ్మ అనుగ్రహం లభిస్తుంది..

ఇకపోతే ఇంటి ముందు ప్రధాన తలుపు ఇంట్లోనే మిగతా అన్ని తలుపుల కంటే కొద్దిగా పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఆ తలుపులను లోపలి నుంచి తెరిచేలా ఉండాలి. అలా తెరిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇంటి ముందు రంగోలి : ఇంటి ప్రధాన ద్వారం ముందు తప్పకుండా అందమైన ముగ్గులు పెట్టుకోవాలి. అమ్మవారికి సంప్రదాయ ముగ్గులు అంటే చాలా ప్రీతికరం. ఆ ముగ్గులతోని మీపై అమ్మకి జాలి దయ ప్రేమ కలిగి ఇంట్లోకి అడుగుపెడుతుంది..ఈ నియమాలను ప్రతి ఆదివారం పాటించాలి.. ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news