వైసీపీ పార్టీని రద్దు చేయండి – రఘురామకృష్ణ

-

వైసీపీ పార్టీనైనా రద్దు చేయాలని, లేకపోతే అధ్యక్ష పదవికి ఎన్నికలైనా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో రఘురామకృష్ణ రాజు గారు కోరినట్లు తెలిపారు. గత ఏడాది జూలై మాసంలో తమ పార్టీ శాశ్వత జీవితకాల అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారని, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఆ ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు. శాశ్వత జీవితకాల అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించడం వల్ల తనతో పాటు పలువురు పోటీ చేయలేకపోయారని వెల్లడించారు.

తమ పార్టీ పేరు ఏమిటి అన్నది తెలియజేయాలని రఘురామకృష్ణ రాజు గారు ఎన్నికల కమిషన్ ని కోరారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉన్న తమ పార్టీ పేరును వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నట్లు గత ఏడాది జరిగిన ప్లీనరీలో తీర్మానించారని తెలిపారు. తమ పార్టీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 55 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, పార్టీ పేరుతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి అనుమతి ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ అనుమతి ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు కాదా అని నిలదీశారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శులకు, ప్లీనరీకి హాజరైన లక్షన్నర మందికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదని, కానీ తమ పార్టీ అధ్యక్షుడికి మాత్రం మూడున్నర నెలల తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫురణకు వచ్చిందని ఎద్దేవా చేశారు.

జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించినప్పుడు ముసిముసి నవ్వులు నవ్విన జగన్ మోహన్ రెడ్డి గారు మూడున్నర నెలల తర్వాత తూచ్… ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని శాశ్వత జీవితకాల అధ్యక్ష పదవిని త్యజించారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేర్కొన్నారన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తనతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారేమోనని చెప్పారు. తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే పోటీ చేస్తానన్న ఆయన, పార్టీలో ఉంచుకోవాలని కోరే అధికారం తనకు లేదని చెప్పారు. ఇక పత్రికల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని, ఈ నిధులతో గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కేవలం సాక్షి దినపత్రికను మాత్రమే కొనుగోలు చేస్తూ ఆ పత్రిక సర్కులేషన్ కు దోహదపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిధులతో ఇతర పత్రిక లేవైనా కొనుగోలు చేశారా లేదా అన్న దానిపై ఆరా తీయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news