నవ్వితే సొమ్మేం పోయింది..? నవ్వడం వలన ఎన్నో లాభాలు..!

-

చాలా మంది నవ్వడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కూడా సీరియస్ గా ఉంటారు. నవ్వితే సొమ్మేం పోదు. నవ్వడం వలన నిజానికి ఎన్నో రకాల లాభాలని మనం పొందొచ్చు. మరి నవ్వితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనే ముఖ్య విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆనందంగా ఉంటూ నవ్వుతూ ఉంటే మన హార్మోన్లు లో కూడా మార్పు వస్తుంది. నవ్వితే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి ఈ కారణంగా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాలు అని మనం నవ్వుతూ పొందవచ్చు. ఎక్కువగా నవ్వితే ఒత్తిడి కూడా దూరం అవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఒత్తిడి నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఎక్కువగా నవ్వడం వలన ఇతరుల దృష్టిని కూడా ఆకర్షించగలం నవ్వుతో సంబంధాలను మెరుగుపరచుకోవచ్చు స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. నవ్వినప్పుడు సెరోటోని అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆందోళన, నిరాశ వంటివి ఇది తగ్గిస్తుంది. నవ్వితే జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చు. శ్రద్ధ ఏకగ్రత బాగా పెరుగుతుంది సృజనాత్మకత కూడా పెరుగుతుంది. నవ్వడం వలన ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. ఎముకల్లో నొప్పి మంట వంటివి కూడా తగ్గుతాయి. ఒత్తిడి సమయంలో రక్తపోటు హృదయస్పందన పెరుగుతుంది.

కానీ నవ్వడం వలన ఎండార్పిన్ అనే ఒక ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది హార్ట్ రేట్ ని తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది నవ్వు. బాగా నవ్వడం వలన తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. నవ్వితే నిత్య యవ్వనం ని కూడా పొందొచ్చు నిత్యం నవ్వుతూ ఉండే వాళ్ళు వాళ్ల కంటే మూడేళ్లు చిన్న వాళ్ళలా కనబడతారు. ఇలా నవ్వుతో ఇన్ని లాభాలని పొందొచ్చు. సో.. మరి ఎందుకు లేట్ రోజూ కాసేపు ఏదో కారణం చేత నవ్వేస్తూ హ్యాపీ గా హెల్తీ గా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news