బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ చీఫ్ కేసిఆర్ సమావేశమయ్యారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అనవసరంగా ట్రాప్లో పడొద్దన్నారు కేసిఆర్.మంత్రులు జనంలో ఉన్న సమయంలోనే అభివృద్ధి పనుల కోసం వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. ఇటీవల సీఎం రేవంత్ ను పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కలిసిన నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవాళ శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీలోని ఎల్డీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. అంతేకాకుండా మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.