ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అప్పుడు కచ్చితంగా ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యం మనం తీసుకునే ఆహార పదార్థాలు బట్టి ఉంటుంది. కొన్ని తీసుకోవడం వలన ఎముకలు తొందరగా బలహీనమైపోతాయి. కొన్ని తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. మరి వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సోడా లో ఎక్కువ సోడియం, చక్కెర ఉంటుంది. ఎముకలకు ఇది హాని చేస్తుంది. క్యాల్షియం స్థాయిలని తగ్గించి ఎముకలని బలహీన పరుస్తుంది. కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని కూడా తీసుకోకండి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వలన శరీరంలో క్యాల్షియం స్థాయిలు తగ్గిపోతుంది. దాంతో ఎముకలు బలహీన పడిపోతాయి.
షుగర్ డ్రింక్స్ తీసుకోవడం వలన కూడా ఎముకలు బలహీనమైపోతాయి. ఆల్కహాల్ వలన కూడా ఎముకలు బలహీనమైపోతాయి. పాల ఉత్పత్తులను తీసుకుంటే బలంగా ఎముకలు ఉంటాయి. క్యాల్షియం, ప్రోటీన్స్, ఎముకల బలాన్ని పెంచగలవు. గ్రీన్ టీ లో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఎముకలని ఆరోగ్యంగా గ్రీన్ టీ మారుస్తుంది. కొబ్బరి నీళ్లు కూడా ఎముకల్ని ఆరోగ్యంగా మార్చగలవు.