ఒకరి మనసుకి దగ్గరవ్వాలనుకుంటే ఇవే ఉత్తమమైన మార్గాలు..!

-

ఒకరి మనసుకి దగ్గరవడం అనేది అంత సులభం కాదు అందరికీ ప్రతి ఒక్కరు నచ్చాలని ఎటువంటి రూల్ లేదు. మీరు ప్రేమించే వాళ్లు మిమ్మల్ని ప్రేమించాలన్నా మీరు వాళ్ళ దగ్గర వలన కొన్ని మార్గాలు ఉన్నాయి.

 

పైగా జీవితభాగస్వామితో దగ్గరవ్వాలంటే శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఒకటి ఇవ్వాలి. అయితే మీరు ఒకరి మనసుకి దగ్గర అవ్వాలంటే ఇలా చెయ్యండి. అప్పుడు కచ్చితంగా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్ట పడతారు.

వారిని ప్రశంసించండి:

ఒకరిని ప్రశంసించండి వలన వాళ్ళు మీకు దగ్గరవుతారు. నిజానికి ప్రశంస ఎంతో దూరం తీసుకు వెళ్తుంది. కనుక వాళ్ళను ప్రశంసించండి. అయితే ప్రశంసించేటప్పుడు నిజంగా మెచ్చుకోండి. ఇవి ఫేక్ గా కనపడకూడదు.

ఉత్సాహంగా ఉండాలి:

వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు ఆసక్తితో వినండి. అలానే వారిపై ఆసక్తి మీకు ఉండాలి. అదే విధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మీరు ఇష్టంగా ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇష్ట పడతారు.

మంచి కనెక్షన్ ని మైంటైన్ చెయ్యండి:

ఒకరి కోసం ఒకరు సమయం ఇవ్వాలి. అలానే స్పెషల్ గా వాళ్ళని ట్రీట్ చెయ్యండి. వాళ్ళతో సమయం గడపడం, బహుమతులు ఇవ్వడం, మాట్లాడడం, గెలుపోటములతో తోడుగా ఉండడం ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం.

మీరు మీలానే ఉండాలి:

చాలా మంది ఒకరి మనసుని గెలుచుకునే క్రమంలో నటించేస్తూ వుంటారు. ఏ మాత్రం రీయల్ గా వుండరు. రీయల్ గా లేకపోతే రిలేషన్స్ పాడవుతాయి. కనుక నిజాయితీగా ఉండాలి. మీరు మీలానే ఉండాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news