TRS ప్రభుత్వంపై కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గురువారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు 38, 500 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు అదనంగా లక్ష 25 వేల కోట్లకు పెంచారని అన్నారు. అప్పుల గురించి అడగడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందన్నారు.

తెలంగాణలో అప్పుడే పుట్టిన బాబుకు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ” నేను తెలంగాణ ప్రజలకు కోసం నమస్కరిస్తున్న. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి తెలంగాణలో అమల్లోకి రావాలి. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేనే ప్రధానమంత్రిని అని కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారు. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు. ఉపాధి హామీ పథకం కోసం 20 వేల కోట్లు ఇచ్చాము.

ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు. మేము పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారు. ప్రజలను భయపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారు. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండి. లిక్కర్ స్కాంపై ఎవరి ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతుంది. కేంద్రం ఒకటి పెడితే రాష్ట్రం ఇంకో పేరు పెడుతుంది. ప్రశ్నిస్తే కేంద్రాన్ని విమర్శిస్తున్నారు.” అంటూ మండిపడ్డారు నిర్మల సీతారామన్.

Read more RELATED
Recommended to you

Latest news