పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే… వీటిని ఇవ్వండి..!

-

పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకి మంచి ఆహారం ఇవ్వడం… ఫిజికల్ యాక్టివిటీ నిద్ర ఇవన్నీ కూడా సరిగా ఉండేటట్టు చూసుకోవాలి తల్లిదండ్రులు. ఈ మధ్య కాలం లో చాలా మంది పిల్లలు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు జలుబు దగ్గు మొదలైన ఇబ్బందులు కలుగుతున్నాయి అందులోనూ చలికాలం కాబట్టి ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి.

 

అందుకని తల్లిదండ్రులు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చూడాలి. పిల్లలు రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే పిల్లలు లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

గింజలు

పిల్లలకి గింజలుని ఇవ్వండి అవిసె గింజలు చియా సీడ్స్ వంటివి పిల్లలకి ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

చేపలు, మాంసం

పిల్లలకి చేపలు మాంసాన్ని కూడా పెడుతూ ఉండండి ఇవి కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. జింక్ ఐరన్ చేపల్లో ఎక్కువ ఉంటుంది అలానే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

తృణధాన్యాలు

తృణధాన్యాలుని కూడా పిల్లలకి ఇస్తూ ఉండండి. కొర్రలు సామలు వంటివి పెడితే పిల్లలు లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పసుపు

పసుపు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఇంఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి.

గుడ్లు

గుడ్లని కూడా పిల్లలకి రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి. ఇవి కూడా పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news