నవరాత్రుల్లో అమ్మను ఇలా పూజిస్తే సంతానం తప్పనిసరి!

-

దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అమ్మ నిజంగా అమ్మే. భక్తితో అమ్మను ఆరాధిస్తే శ్రీఘ్రంగా అనుగ్రహిస్తుందని శాస్త్ర ప్రవచనం. చదువు, ధనం, ఆరోగ్యం, సిరి సంపదలు, సంతానం, ఉద్యోగం ఇలా ఏదైనా అమ్మ అనుగ్రహం ఉంటే తప్పక లభిస్తాయి. నాటి రాజుల నుంచి నేటి పాలకుల వరకు అమ్మ అనుగ్రహానికి దశమహావిద్యల్లోని స్త్రీ శక్తి ఆరాధన చేస్తున్నారు. రాజశ్యామల, బాలా, కాళీ, దుర్గా, మహాలక్ష్మీ, సరస్వతి ఇలా రకరకాల రూపాలను ఆరాధిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు. అయితే నవరాత్రుల్లో అమ్మను బాలాత్రిపుర సుందరి దేవిగా పూజిస్తే తప్పక మంచి జరుగుతుంది. బాలా త్రిపురసుందరిని కింది విధంగా అర్చిస్తే అన్ని శుభాలే కలుగుతాయి..

 

‘హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలామ్‌
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీమ్‌’

శరన్నవరాత్రి ఉత్సవాలలో భువనేశ్వరి బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత.

కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. ‘ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుంద్యనమోనమః‘ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి. ఇక ఆలస్యమెందుకు అమ్మను పూజించి సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు సంతాన భాగ్యాన్ని పొందండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news