గురుకుల విద్యార్థుల భోజనంలో పురుగులు.. 20 మందికి అస్వస్థత

-

సంక్షేమ గృహాలు, గురుకుల పాఠశాలల్లో భోజనం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. కలుషిత ఆహారం వల్ల దాదాపు రోజు పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అయినా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం లేదు. ఓ వైపు తమ పిల్లల ఆరోగ్యం ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్​నగర్‌లోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

పురుగులు పట్టిన అన్నం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు ఆందోళన చేశారు. భోజనంలో పురుగులు వచ్చాయని ప్రిన్సిపాల్, వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పాఠశాల వద్దకు చేరుకోవడంతో పాఠశాల సిబ్బంది లోపలికి అనుమతించలేదు. అప్పటికే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెనుకవైపు నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. పోలీసులు రావడంతో.. వారి వాహనంలోనే విద్యార్థులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు

Read more RELATED
Recommended to you

Latest news