చేతికి సెలైన్‌తో ఇలియానా.. ఆందోళనలో అభిమానులు

-

స్లిమ్ బ్యూటీ ఇలియానా తన ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర విషయం వెల్లడించింది. ఆసుపత్రి బెడ్ పై చేతికి సెలైన్ తో ఉన్నప్పటి ఫొటోను పంచుకుంది. ఇటీవల తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని ఇలియానా తెలిపింది. డాక్టర్లు తనకు మూడు బ్యాగుల ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారని వివరించింది. ఒక్క రోజులో ఎంత తేడా! అంటూ ఈ బక్కపలుచని భామ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతూ, సందేశాలు పంపుతున్న ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు అని వెల్లడించింది. సకాలంలో వైద్యసాయం అందుకున్నానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నానని, అభిమానులు తన పట్ల చూపుతున్న ఆదరణకు నిజంగా ముగ్ధురాలినయ్యానని వివరించింది.

ఇదిలా ఉంటే.. ఇలియానాకు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించి తాను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కటి గోవా బ్యూటీ ధన్యవాదాలు తెలిపింది. ” ప్రతి ఒక్కరు నా హెల్త్ గురించి మెసేజ్ చేస్తున్నారు. నా మీద అంత ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి నిజమైన ప్రేమను అందుకుంటున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నేను ఖచ్చితంగా ఇప్పుడు బావున్నాను అని చెప్తున్నాను. దేవుని దయవలన తగిన సమయంలో తగిన చికిత్స నాకు దొరుకుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇల్లూ బేబీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news