తెలుగు రాష్ట్రాలకు వెదర్ వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. రానున్న మూడు రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చిరంచింది. పశ్చిమ నైరుతి మధ్య బంగాళాశాతంలో ఏపీ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. సముద్రమట్టానికి 8.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 9 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చిరించింది. రాయలసీమలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తామని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు బంగాళాఖాతంలో శ్రీలంకను అనుకుని కొమరిన్ వరకు అల్పపీడనం ఏర్పడటంతో, ఏపీని అనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.. దీంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
-