ఏపీలో దారుణం..బాలికపై వాలంటీర్‌ అత్యాచారం

మన దేశంలో రోజు రోజుకు మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరించినా.. చట్టాలు తీసుకువచ్చినా… మహిళలపై దాడులు ఆగడం లేదు. అయితే.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాకులం జిల్లాలో ఓ వాలంటీర్‌ దుర్మార్గానికి తెర లేపాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే బాలిక పై వాలంటీర్‌ లైంగిక దాడి చేశాడు.

ఈ దారుణమైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని. వీరఘట్టం మండలం నడుకూరు లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ విషయం బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలియ జేసింది. దీంతో ఆ బాధితురాలి తల్లిదండ్రులు… స్థానిక పోలీస్టేషన్‌ లో ఫిర్యాదు చేసారు. దీంతో ఈ ఘటనకు కారకుడైన వాలంటీర్‌ మరియు సహాయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు పరారీ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.