వంటింట్లో వుండే ఈ పదార్ధాలతో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఈ సమస్యలు వుండవు..!

-

మనం నిత్యం ఎన్నో పదార్థాలని వంట కోసంlఉ ఉంటాము. అయితే కొన్ని కొన్ని పదార్థాలలో ఆరోగ్యానికి చాలా మేలు చేసే గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి మొదలు ఇంఫ్లమేషన్ తగ్గించుకునే వరకు చాలా బెనిఫిట్స్ మనం వీటి ద్వారా పొందొచ్చు అని నిపుణులు అంటున్నారు.

వీటిని కనుక రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అదే విధంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి ఆలస్యమెందుకు వాటి కోసం మనం ఇప్పుడే చేద్దాం.

పసుపు :

ఆరోగ్యానికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. పసుపు వల్ల కలిగే ఉపయోగాలు ఉన్నాయని మనకి తెలుసు. పసుపుని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా గాయాలని మాన్పించడానికి కూడా సహాయపడుతుంది.

నల్ల మిరియాలు:

ఇంఫ్లమేషన్ ని తగ్గించడానికి నల్ల మిరియాలు చాలా మేలు చేస్తాయి. గొంతు, ఊపిరితిత్తులు, జాయింట్ పెయిన్స్ ఇలా ఎక్కడైనా సరే ఇంఫ్లమేషన్ ని దూరం చేస్తాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా ఈజీగా మనం దీంతో చెక్ పెట్టొచ్చు .

అల్లం:

అల్లం వల్ల చాలా చక్కగా ప్రయోజనాలు ఉన్నాయి. రెగ్యులర్ గా దీన్ని వంటల్లో ఉపయోగిస్తే ఎంతో మేలు కలుగుతుంది. కీళ్లనొప్పులు, బ్లోటింగ్, మెన్స్ట్రుల్ క్రామ్ప్స్ వంటి సమస్యలు అల్లం తో దూరం అయిపోతాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

లవంగాలు:

లవంగాలు పంటి నొప్పిని, గొంతు నొప్పిని, కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. అదే విధంగా ఇతర బెనిఫిట్స్ ఎన్నో కూడా మనం లవంగాలతో పొందవచ్చు. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కనుక రెగ్యులర్ గా దీన్ని కూడా వంటల్లో ఉపయోగించండి. మీరు కావాలంటే పసుపు, నల్ల మిరియాలని వంటల్లో వేసుకోవచ్చు లేదు అంటే ఈ రెండిటినీ కలిపి టీ లాగా చేసుకుని తాగొచ్చు. ఎలా తీసుకున్నా సరే వీటి వల్ల మీరు చక్కటి ప్రయోజనాలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news