అమెరికాలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఇంగ్లీషులో చెబుతున్న బ్రాహ్మణుడు..!

-

సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తెలుగు ప్రజలు చాలా సందర్భాల్లో భక్తి శ్రధ్దలతో జరుపుకుంటారు. ముఖ్యంగా నూతన  గృహ ప్రవేశం, పెళ్లిలు, మరే ఇతర సందర్బంలోనైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటే మంచి జరుగుతుందని హిందువులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తుంటారు. కొంత మంది చేసుకోలేని వారు కనీసం ఆ ప్రసాదం అయినా స్వీకరిస్తే.. స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని వ్రతం చేసే సందర్భంలో పుటలు పుటలుగా కథను విశ్లేషిస్తుంటారు. 

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తెలుగు లోగిళ్లలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ పూజ సందర్భంగా సత్యనారాయణ స్వామికి సంబంధించి చెప్పే కథలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ కథలను ఓ పూజారి ఇంగ్లిష్‌లో అంతే చక్కగా వివరిస్తున్నారు. అమెరికాలో ఓ బ్రాహ్ముణుడు ఇంగ్లీషులో చాలా అద్బుతంగా ఈ కథను చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రవాస భారతీయులెవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకున్నప్పుడు తీసిన వీడియో అయుండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news