హైదరాబాద్ లో డైలీ ఎన్ని వేల వాహనాల సీజ్… ఇది లెక్క

నార్త్ జోన్ పరిసర ప్రాంతాల్లో లాక్ డౌన్ ఏర్పాట్లను పరీశీలించిన హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. నగరంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాం అని అన్నారు. నార్త్ జోన్ పరిధిలో ఎక్కువగా ఇతర జిల్లాల నుండి వాహనాలు వస్తున్నాయి అని తెలిపారు. నార్త్ జోన్ పరిసర ప్రాంతాలలో మెడికల్ ఎమర్జెన్సీ ఎక్కువగా ఉందన్నారు.

ఫేక్ ఐడి కార్డ్స్ నకిలీ పాస్ లు తీసుకుని రోడ్ల మీదకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం అని స్పష్టం చేసారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు5 వేల నుండి 6 వేల వాహనాలు సీజ్ చేస్తున్నాం అని అన్నారు. ఈరోజు నార్త్ జోన్ లో ఇప్పటికే 100 వాహనాలను సీజ్ చేసామని ఆయన తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి లాక్ డౌన్ ను విజయవంతం చేయాలి అని ఆయన కోరారు.