మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మండిపడ్డారు బిజెపి నాయకురాలు విజయశాంతి. రైతులకు నష్టం వాటిల్లి ఇన్ని రోజులు అవుతన్నా అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మహబూబ్‌నగర్ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని నవాబ్‌పేట మండల పరిధిలోని యాన్మన్ గండ్ల చెరువు కట్ట సరిగ్గా లేకుంటే… దాన్ని వదిలేసి తూముకు రిపేర్లు చేశారు. పైగా పూడిక తీత పేరిట కట్ట పొంటి ఒండ్రు మట్టిని తీశారు.
కట్ట తెగేటట్లుందని, వెంటనే రిపేర్లు చేయాలని రైతన్నలు మూడునెలల క్రితమే స్థానిక ఆఫీసర్లను కోరినా చర్యలు తీసుకోలేదు. జిల్లా స్థాయి ఆఫీసర్లకు ఎస్టిమేషన్లు పంపగా వాళ్ల నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో కట్ట మరింత బలహీన పడి, మూడు రోజుల క్రితం వచ్చిన వరదకు తెగిపోయింది. ఫలితంగా చెరువు మొత్తం ఖాళీ కావడమే కాకుండా.. దిగువనున్న 320 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.
2016లో రెండో విడత మిషన్ కాకతీయ కింద రూ.80 లక్షలతో చెరువులో పూడిక పనులు చేపట్టారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కాకుండా అప్పట్లో ఇక్కడ వీఆర్వోగా పనిచేసిన వ్యక్తి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేయించాడు. ఈయన కట్ట పొంటి మట్టిని తీయించాడు కానీ కట్టను పటిష్టం చేయలేదు. బిల్లులు మాత్రం డ్రా చేసుకున్నాడు. ఇలా బలహీనంగా మారిన చెరువు కట్ట…. ఎగువ నుంచి వచ్చిన వరదను తట్టుకోలేక సోమవారం సాయంత్రం చెరువుకు గండి పడడంతో 320 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నయి.
ఇందులో 290 ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో మక్క చేలు ఉన్నయి. చెరువుకు దగ్గర్లో ఉన్న 180 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మిగతా చోట్ల పొలాల్లో చెత్త, బురద పేరుకుపోయింది. అయినా అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. “. అంటూ ట్వీట్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని నవాబ్‌పేట మండల పరిధిలోని యాన్మన్ గండ్ల చెరువు కట్ట సరిగ్గా లేకుంటే… దాన్ని వదిలేసి తూముకు రిపేర్లు చేశారు. పైగా పూడిక తీత పేరిట కట్ట పొంటి ఒండ్రు మట్టిని తీశారు. pic.twitter.com/gLHk6iWLWT
— VIJAYASHANTHI (@vijayashanthi_m) August 11, 2022