ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఇండియన్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ రికార్డులన్నిటినీ తిరగ రాస్తున్నాయి. ఈ క్రమంలోనే బీ టౌన్ సినీ ప్రముఖులు సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ పైన ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు దక్షిణాది సినిమాల గురించి తన అభిప్రాయం చెప్తూనే, తన అభిమాన నటుడు దక్షిణాదికి చెందిన స్టార్ హీరో అని పేర్కొన్నాడు. ఆయన ఎవరంటే..
ఇటీవల విడుదలైన ‘పుష్ప, RRR, KGF2’ ఇండియన్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ ఈ చిత్రాలు తిరగరాశాయి. ఈ క్రమంలోనే సౌతిండియన్ ఫిల్మ్స్ పైన నార్త్ ఇండియన్ ఆడియన్స్, ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీయే దేశంలో అతిపెద్ద ఇండస్ట్రీ అన్న అభిప్రాయాన్ని ఇటీవల కాలంలో తప్పని నిరూపించాయి ఈ పిక్చర్స్.
ఇలా దక్షిణాది చిత్ర సీమకు చెందిన సినిమాలు నార్త్ ఇండియాలో విశేష ఆదరణ పొందుతుండటం పట్ల ఆధిపత్యమని కొందరు భావిస్తున్నారు. ఈ విషయమై బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను ప్రశ్నించారు. ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. చాలా కాలం నుంచే సౌతిండియన్ ఫిల్మ్ మేకర్స్ క్రేజీ ఫిల్మ్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఆయుష్మాన్ ఖురానా. ‘విక్కీ డోనర్’ పిక్చర్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో..ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నారు.
తాను దక్షిణ భారతదేశానికి చెందిన తారల సినిమాలు చూస్తానని, ఓటీటీ వలన ప్రజలు అన్ని భాషల చిత్రాలు చూస్తున్నారని వివరించారు. తాను ముఖ్యంగా మలయాళ సినిమాలు ఫాలో అవుతానని, ‘పుష్ప’ నటుడు, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్(ఫఫ) కు తాను వీర అభిమానినని పేర్కొన్నాడు ఆయుష్మాన్. వసయస్సుతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందిన గొప్పు నటుడు ఫఫ అని కొనియాడారు. ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం ‘అనేక్, డాక్టర్ జీ, యాన్ యాక్షన్ హీరో’ చిత్రాలు చేస్తున్నారు.