ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానంగా పార్టీలో ఉన్న వర్గ విభేదాలు పార్టీకి ప్రధాన సమస్యగా మారుతున్నాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పుడు అధికార వైసీపీలో కొన్ని విభేదాలు జగన్ కు తలనొప్పిగా మారాయి అనే విషయం అర్థమవుతుంది.
ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ విషయంలో కాస్త దూకుడుగా ఉన్నారు. జిల్లాలో వాళ్ల విషయంలో కాస్త ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్నా దూకుడుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అంటూ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు అలాగే మంత్రులకు వాళ్లు సహకరించడం లేదని కనీసం కార్యకర్తలతో కూడా వాళ్ళు మాట్లాడటం లేదని అంటున్నారు.
కేవలం రెండు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యేలు ఇప్పుడు జిల్లా మొత్తం కూడా దృష్టి పెడుతున్నారు అని సమాచారం. దీని కారణంగా పార్టీల వర్గ విభేదాలు పెరుగుతున్నాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలి అని భావిస్తున్న ఒక ఎమ్మెల్యేగారు అయితే ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కారణంగా జిల్లాలో వైసీపీ కార్యకర్తలలో ఆగ్రహం పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టి ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.