Breaking : పీఆర్సీ మీద కేసీఆర్ కీలక ప్రకటన

-

ఉద్యోగుల వేతన సవరణ ఐదేళ్లకు ఓ సారి జరగాల్సి ఉందని కానీ ఈ సారి ఆర్థిక మాంద్యం కారణంతో ఆలస్యం అయ్యిందని కేసీఆర్ పేర్కొన్నారు.  అన్ని రకాల కమిటీలు అధ్యయనం చేసిందన్న ఆయన ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో సాహసోపేత…సకల జనుల సమ్మెలో కూడా మన ఉద్యోగులు పాల్గొన్నారని అన్నారు.

ఇది దేశంలో అద్భుత ఉద్యమం అని ఉమ్మడి రాష్ట్రంలో కూడా సంఘం పేరు మార్చుకోని సంఘం ఏదయినా ఉందంటే అది tngo అని అన్నారు.  ప్రభుత్వ ఉద్యోగ..ఉపాధ్యాయుల కు వేతన సవరణ అంటూ ఆయన పీఆర్సీ ప్రకరించారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్ వాడి, ఆశా వర్కర్లు, వీఆర్వో, వీఆర్ఏ అందరికీ మొత్తం 9లక్షల ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నామని ప్రకటించారు కెసిఆర్.  గ్రాట్యుటీ కూడా 12 నుంచి 16 లక్షలకి పెంచారు. ప్రమోషన్ల ప్రక్రియ సత్వరమే ప్రారంభిస్తామని అయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news