అబ్బాయికి కొంత స్థిరాస్తి ఉండాలి,జీతం ఐదు అంకెల్లో ఉండాలి, మోడరన్ భావాలు కలిగి ఉండాలి, కచ్చితంగా పట్టణంలోనే ఉండాలి… అమ్మాయి కచ్చితంగా చదువుకొని ఉండాలి, మోడరన్ గా ఉండాలి కాని సాంప్రదాయం గా ఉండాలి,వీలయితే ఉద్యోగం చెయ్యాలి,అన్ని భాద్యతలు చక్కగా ఓర్పు నేర్పు గా చక్కబెట్టుకునే అమ్మాయి అయ్యి ఉండాలి.
అమ్మాయి తరపు వారికి,అబ్బాయి తరపు వారికి ఇలా ఇరువురికి వారి పిల్లలు భవిష్యత్తు గురించి వారి ఆర్థిక భద్రత కల్పించండి కోసం కొంత స్థిరాస్తి పొలం రూపంలో ఉండాలి అని అంటున్నారు.కానీ మరి పొలాన్ని పండించే వ్యవసాయదారులకు ఇచ్చి పెళ్లి చేయడానికి మాత్రం సుముఖంగా లేరు.పోని ఐదంకెల జీతం వచ్చి వెనుక స్థిరాస్తి లేకపోయినా పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నారు.
కారణం ఏంటంటే రేపు ఏదైనా ఆర్ధిక పరిస్తితిలో తేడా వస్తే బ్రతుకు భద్రతకు కచ్చితంగా స్థిరాస్తి పొలం ఉండాలి అనేది ఇరువర్గాలు వారి అభిప్రాయం. ఇది కేవలం తల్లితండ్రులు అభిప్రాయం అనుకుంటే పొరపాటే. మోడరన్ భావాల ఊహల్లో అందరిలోనూ ఒకే రకమైన ఆలోచనలు..! అది కొంచెం అటుఇటు గా చెప్పుకున్న ఆఖరికి ఒప్పుకోవాల్సిన విషయం “డబ్బు”.
పెళ్ళిళ్ళు జరగడానికి అయినా, ఆ పెళ్లి పెటాకులు అవ్వడానికైన ఏకైక కారణం ఆస్తి అని చెప్పుకునే “డబ్బు” తోనే కారణాలు ముడిపడి ఉన్నాయి. తల్లితండ్రులు అయినా అమ్మాయిలు అబ్బాయిలు అయినా పెళ్లి కి వెనుక ఆస్తి ని కాక అర్హత ను ఆధారంగా చూసి పెళ్లి చేసుకుంటే భద్రతతో పాటు ఇరువురికి మంచి భవిష్యత్తు ఉంటుంది…