జనసేనకు బిగ్ షాక్, సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ గుడ్ బాయ్…!

-

జనసేన పార్టీకి సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పారు. కొంత కాలంగా పవన్ విషయంలో అసహనంగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు ఆయన. ప్రజాసేవ కోసం తాను సినిమాల్లోకి వెళ్ళను అని పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పారని ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళడం తనకు నచ్చలేదని పేర్కొన్న ఆయన రాజీనామా చేసారు.

ఈ మేరకు ఆయన ఒక లేఖను కూడా విడుదల చేసారు. “పూర్తి జీవితం ప్రజాసేవకే అని సినిమాలలో నటించనని, మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తుంది. నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను.

ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతీ కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతీ ఓటరుకి కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికీ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news