ఉత్తరప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల్లో డ్యూటీలో పాల్గొని 577 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది మరణించారు అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఇసి) కు ఉపాధ్య సంఘాలు జాబితాను ఇచ్చాయి. మే 2 న లెక్కింపు సంబంధించి వాయిదా వేయాలని యూనియన్లు ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేసాయి. కోవిడ్ -19 మహమ్మారి రెండో వేవ్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో 71 జిల్లాలలో 577 మంది ప్రాథమిక ఉపాధ్యాయులు మరణించారని యుపి శిక్షాక్ మహాసంఘ్ (యుపిఎస్ఎం) అధ్యక్షుడు దినేష్ చంద్ర శర్మ తెలిపారు.
పంచాయతీ పోల్ డ్యూటీ సమయంలో కోవిడ్ -19 కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన దానిపై వివరణ కోరుతూ అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఎస్‌ఇసికి నోటీసులు ఇచ్చింది. తమ జిల్లాల్లో ఉపాధ్యాయుల మరణాల గురించి నివేదికలను ధృవీకరించాలని, 24 గంటల్లో నివేదికను అందించాలని స్పెషల్ వర్క్ ఆఫీసర్ ఎస్.కె. సింగ్ అన్ని డీఎంలు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులకు బుధవారం లేఖ విడుదల చేశారు.