ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో పరిస్థితి ఇంత దారుణమా…?

-

యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని “ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్” డాక్టర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేసారు. కరోనా నేపథ్యంలో రక్తదాతల్లో కొన్ని అపోహలున్న మాట వాస్తవం అని ఆయన అన్నారు. రక్తదానం చేస్తే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది అనడం అపోహ మాత్రమే అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాదులోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిధులు నిండుకున్నాయి అని వివరించారు.

గతంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో నెలకు 1800 మంది రక్తదానం చేసేవారు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రక్తదానం చేసే వారి సంఖ్య నెలకు 100 నుంచి 150 లోపు మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వటం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో డోనర్స్ సంఖ్య తగ్గింది అని అన్నారు. ఐటీ ఉద్యోగులు బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహించేవారు అని, వ్యాక్సిన్ తీసుకున్న 28రోజుల వరకు బ్లడ్ డొనేషన్ చేయవద్దు అని సూచించారు. 18ఏళ్ళు నిండిన వారందరకీ వ్యాక్సిన్ ఇస్తే.. బ్లడ్ కు తీవ్ర కొరత ఏర్పడుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news