ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడిని ఉంచాలి ?

-

హనుమాన్‌ ఆ నామమే చాలు సకల భయాలను పోగొడుతుంది. ఆయన పేరు చెపితే చాలు సకల పాపాలు, భయాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. స్వామిని పరమ భక్తితో ఆరాధిస్తే చాలు అన్ని శుభాలే. అయితే ఆ స్వామి చిత్రపటాన్ని ఉంచి సాక్షాత్తు స్వామిగా భావించి ఆరాధించాలి. అయితే స్వామిని ఏ దిక్కున ఉంచి పూజిస్తే ఏం ఫలితమో తెలుసుకుందాం…


– తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగచేస్తాడు.
– దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
– పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
– ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
– ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
– మీకు ఏ రకమైన కోరికలు, అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా స్వామిని ఉంచి ఆరాధించండి. సత్పలితాలు పొందండి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news