శభాష్ గోవా.. వ్యాక్సినేషన్లో గోవాను చూసి నేర్చుకోవాల్సిందే.

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తం అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా చురుగ్గా స్పందిస్తున్నాయి. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గమని తెలుస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఐతే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో గోవా రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అర్హులైన రాష్ట్రంలోని వారందరికీ మొదటి డోసు ఇచ్చినట్లు గోవా తెలిపింది.

రాష్ట్రంలోని అర్హులైన ప్రజలందరికీ కరోనా మొదటి డోసు ఇచ్చినట్లు గోవా ప్రకటించింది. దీంతో గోవా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందనే చెప్పాలి. అంతేకాదు, సెకండ్ డోసు కూడా అందరికీ అందిస్తామని, అక్టోబర్ అంతానికి అందరికీ సెకండ్ డోసు పడిపోతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మొత్తానికి చిన్న రాష్ట్రమైన గోవా వ్యాక్సినేషన్ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.