గుడ్ న్యూస్ : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు జీతాలు పెంచుతు నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా దానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల ప్రకారం సీనియ‌ర్ కేట‌గిరీ లో అసిస్టెంట్, అకౌంటెంట్, స్టెనో, ట్రాన్స్ లేట‌ర్ తో పాటు ప‌లువ‌రికి జీతాన్ని రూ. 17,500 నుంచి రూ. 21,500 కు పెంచుతు ఉత్త‌ర్వులను జారీ చేసింది.

అలాగే జూనియ‌ర్ విభాగంలో అసిస్టెంట్, డ్రైవ‌ర్, టైపిస్ట్, మెకానిక్, స్టెనో, ఫిట్ట‌ర్ తో పాటు ప‌లువ‌రికి కూడా జీతం రూ. 15,000 నుంచి రూ. 18,500 కు పెంచుతు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. వీరితో పాటు వాచ్ మెన్, స‌బార్డినేట్, కుక్, చౌకీదార్ తో పాటు ప‌లువ‌రికి రూ. 12,000 నుంచి రూ. 15,000 వ‌ర‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీతం పెంచింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news