టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ పూర్తయింది. ఈ రెండో టెస్ట్ మ్యాచ్లో అందరూ ఊహించినట్లుగానే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఏకంగా 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది.

ఇక ఈ రెండు జట్ల మధ్య మరో 3 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ అలాగే ఆకాష్ దీప్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదే సమయంలో గిల్ బ్యాటింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇలా అందరూ రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.