ఇండియాస్ సరికొత్త రికార్డు.. 100 కోట్లు దాటిన వ్యాక్సినేషన్

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇండియా సర్వశక్తులు ఒడ్డు తోంది. ఈ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు… కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్యమంలో కొనసాగిస్తోంది. ప్రతిరోజు 50లక్షలకు తక్కువ కాకుండా కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు వేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే తరపున వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారతదేశం వంద కోట్ల మైలురాయిని తాజాగా అధిగమించింది.

100 కోట్ల మైలురాయిని సాధించిన దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉండగా మన దేశం రెండో స్థానానికి చేరింది. మన ఇండియాలో కరోనా మహమ్మారి అరికట్టేందుకు ఈ సంవత్సరం జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది మోడీ సర్కార్. వ్యాక్సినేషన్ తొలిదశలో వైద్యులు , ఆరోగ్య కార్యకర్తలు , పారిశుద్ధ్య కార్మికులకు కరోనా వ్యాక్సిన్ లు వేసింది.

ఆ తరువాత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారికి… అలాగే మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన పౌరులందరికీ వ్యాక్సినేషన్ అందించింది మోడీ సర్కార్. ఈ నేపథ్యంలోనే అక్టోబరు 21వ తారీకు నాటికి 100 కోట్ల కరోనా డోస్ ల మార్పు దాటేసింది భారతదేశం. ఇక డిసెంబర్ చివరి నాటికి.. దేశంలోని ప్రజలందరికీ వాక్సినేషన్ వేయాలని… లక్ష్యంగా పని చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news