ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మాస్కులు ధరించి బరిలోకి దిగనున్నారని సమాచారం.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనున్న విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మాస్కులు ధరించి బరిలోకి దిగనున్నారని సమాచారం. ఢిల్లీలో ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల నవంబర్ 5వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపటి మ్యాచ్‌లో ఇరు దేశాల ఆటగాళ్లు మాస్క్‌లతో ఆట ఆడనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో రేపు జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఇవాళ టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. అయితే ప్రాక్టీస్‌లోనూ భారత ప్లేయర్లు మాస్కులు ధరించే కనిపించారు. దీంతో రేపటి మ్యాచ్‌లోనూ ప్లేయర్లు మాస్కులు ధరిస్తారని సమాచారం అందుతోంది. కాగా కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో తొలి టీ20కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై నిషేధం కారణంగా ఆ జట్టు కూడా కొత్త కెప్టెన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇక ఈ సిరీస్‌లో 2వ టీ20 గుజరాత్‌లోని సౌరాష్ట్రలో, 3వ టీ20 మహారాష్ట్రలోని విదర్భలో జరగనున్నాయి. ఇరు జట్ల సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, శిఖర్ ధావన్, శివం దూబే, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, క్రునాల్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్.
బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), లైటన్ దాస్, సౌమ్యా సర్కార్, నయీమ్ షేక్, ముష్ఫికుర్ రహీమ్, ఎండీ మిథున్, అఫిఫ్ హుస్సేన్, హుస్సేన్ సైకత్, అమీనుల్ ఇస్లామ్, ఆర్ఫాత్ సన్నీ, తైజుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైఫుల్ ఇస్లామ్, అబు హైదర్, అల్ అమీన్ హుస్సేన్.