భారత్​-చైనాల కీలక ప్రకటన.. అక్కడి నుంచి బలగాల ఉపసంహరణ

-

భారత్ చైనా సైన్యాలు సంయుక్తంగా ఓ కీలక ప్రకటన చేశాయి. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్​ నుంచి భారత్‌-చైనా బలగాల ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపాయి. ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల సందర్భంగా ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇరుదేశాల సైన్యాలు ఈ సాయంత్రం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సమన్వయం, ప్రణాళికబద్ధంగా ఇరుదేశాల బలగాల ఉపసంహరణతో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొన్నాయి.

జులై 17న ఇరుదేశ సైనిక కమాండర్ల మధ్య 16వ విడత చర్చలు జరిగాయి. 2020 ఏప్రిల్‌-మే మధ్య పలు ప్రాంతాల్లో చైనా బలగాలు ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నించటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి 2020 జూన్‌లో భారత్‌-చైనా బలగాల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది

Read more RELATED
Recommended to you

Latest news