ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం.. షాక్ లో సినీ ఇండస్ట్రీ..!

ఆర్మీ నేపథ్యంలో తీసే సినిమాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ భాషలోనైనా ఆర్మీ కథతో సినిమా తీయాలంటే ఇకనుంచి కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపింది. దీంతో రక్షణశాఖకు ముందుగానే కథ చెప్పి వారిని ఒప్పించి, సినిమా విడుదల ముందు రక్షణ శాఖ ప్రతినిధులకు ప్రత్యేక స్క్రీనింగ్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్ఓసీ తీసుకోకపోతే ఆ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ నిలిపివేస్తారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్మీపై సినిమాలు తగ్గిపోతాయనే ప్రశ్న అయితే లేదు. కాకపొతే ఇంతకు ముందు తీసినట్లు ఇష్టానుసారంగా సన్నివేశాలు మాత్రం ఉండకపోవచ్చు.

 

ఆర్మీకి సంబంధించిన ఎలాంటి లోపలి విషయాలను చూపించే ఆస్కారం ఉండదు. ఏదేమైనా కూడా ఎన్ఓసీ తీసుకున్న తర్వాతే వాటికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. మరి దీనిపై సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇండియన్ ఆర్మీని బేస్ చేసుకుని ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. అయితే కొన్ని సినిమాల్లో ఆర్మీ అధికారులకు చులకనగా.. చెడ్డగా కూడా చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్రం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.