తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,677కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,547గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 1088 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47,590 కు చేరింది. ఇక శనివారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 540కి చేరింది. అయితే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 517 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 181 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 146 కొత్త కరోనా కేసులను గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news