తూర్పు లడఖ్ లోని ఎల్‌ఐసి వెంట భారత, చైనా దళాల మధ్య కొనసాగుతున్న వివాదంపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై చర్చ కోసం ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇటీవల రష్యా పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ మాస్కోలో చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగ్ తో భేటీ అయ్యారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా కొద్ది రోజుల క్రితం మాస్కోలో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా కేంద్ర క్యాబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశంలో ఇదే హాట్ టాపిక్ అవుతుంది.