భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్న ఇరు దేశాలు నేడు మరోమారు చర్చలు జరపనున్నాయి. తూర్పు లడఖ్‌లోని అధీనరేఖ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుసూల్‌లో ఇరు దేశ సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్లు నేడు సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణతో పాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడం పైనే ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నారు.
వాస్తవాధీన రేఖను ఖాళీ చేసి రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లినప్పటి తరువాత చైనా సైనికులు సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని, అయినప్పటికీ.. వారిని నమ్మలేమనే అధికారులు చెబుతున్నారు. మున్ముందు ఎలాంటి దుందుడకు చర్యలకు చైనా పాల్పడని విధంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇవే తరహా డిమాండ్లను చైనా సైనికుల ముందు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది.