ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి పోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,06,064 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అంటే నిన్న టి కంటే… 27,469 కరోనా కేసులు తక్కువగా నమోదు అయ్యాయన్న మాట. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,49,335 కు చేరింది. ఇక ఇండియాలో రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉండగా.. వారం రోజుల పాజిటివిటీ 17.03 శాతంగా ఉంది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 439 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4.89 లక్షలకు చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 1.66 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.