ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,313 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,60,470 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,61,555 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 549 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,57,740 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,534 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,41,175 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,05,43,13,977 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 56,91,175 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
Active cases account for less than 1% of total cases, currently at 0.47%; Lowest since March 2020. Total recoveries at 3,36,41,175; Recovery rate at 98.19%: Union Health Ministry pic.twitter.com/KPAuVPfTSt
— ANI (@ANI) October 30, 2021