క‌రోనాపై భార‌త్ స‌మ‌ర్థవంతంగా పోరాడుతోంది

-

క‌రోనాపై భార‌త్ స‌మ‌ర్థవంతంగా పోరాడుతోంద‌ని, ఆ పోరులో భార‌త్ ఇతర దేశాల క‌న్నా ముందంజ‌లో ఉంద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఆయ‌న సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) నిర్వ‌హించిన మెగా ప్లాంటేష‌న్ డ్రైవ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. క‌రోనాపై విజ‌య‌వంతంగా పోరాటం చేస్తున్న దేశం ఏదైనా ఉంది.. అంటే అది భార‌తేన‌ని అన్నారు. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నామ‌ని అన్నారు.

india doing good in fighting with corona virus says amit shah

130 కోట్ల మంది పౌరులు ఉన్న దేశం మ‌న‌ద‌ని, అలాంటి అతి పెద్ద దేశంలో క‌రోనాను ఎదుర్కొన‌డం ఒక స‌వాల్ అని అమిత్ షా అన్నారు. దేశంలోని రాష్ట్రాలు, ప్ర‌జ‌లంద‌రూ ఒక్క‌టై క‌రోనాపై పోరాటం చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ లేనివిధంగా మ‌న దేశంలోనే ప్ర‌జ‌లంద‌రూ క‌ల‌సిక‌ట్టుగా క‌రోనాపై పోరాటం చేస్తున్నార‌ని అన్నారు. కరోనాపై ఇక ముందు కూడా పోరాటం కొన‌సాగుతుంద‌న్నారు. అందులో మ‌నం త‌ప్ప‌క విజ‌యం సాధిస్తామ‌న్నారు.

కోవిడ్ 19 ప్ర‌పంచ మాన‌వాళికే స‌వాల్‌గా మారింద‌ని షా అన్నారు. క‌రోనాపై పోరాటంలో ముందుండి సేవ‌లందిస్తున్న సీఆర్‌పీఎఫ్, పోలీసులు, ఇత‌ర సిబ్బంది, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్య సిబ్బందిని ఆయ‌న క‌రోనా వారియ‌ర్ల‌ని అభివ‌ర్ణించారు. వారికి తాను శాల్యూట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా క‌ద‌ర్‌పూర్ గ్రామంలోని సీఆర్‌పీఎఫ్ ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ క్యాంప‌స్‌లో రావి మొక్క‌ను నాటారు.

Read more RELATED
Recommended to you

Latest news