ఇంగ్లాండ్ – టీమిండియా మధ్య జరిగిన 5వ టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ చేదనతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. టీమిండియా నిర్దేశించిన 378 పరుగులను ఇంగ్లాండ్ అలవోకగా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. దీంతో ఐదు టెస్ట్ ల సిరీస్ ను ఇంగ్లాండ్ 2-2 తో సమానం చేసుకుంది. అయితే తమకు 450 పరుగులను నిర్దేశించిన ఛేదించేందుకు సిద్ధమని మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు.” భారీ లక్ష్య ఛేదన చేయడం ఆనందంగానే ఉంది. అయితే టీమిండియా మాకు 450 పరుగులను లక్ష్యంగా నిర్దేషిస్తే బాగుండేది.
మేము ఏం చేయగలమో చూద్దాం అనేదే నా కోరిక. అయితే చివరికి 378 పరుగుల లక్ష్యం మా ముందు ఉంది. విజయం సాధిస్తే ఇతర జట్లు మనల్ని ఎలా చూస్తాయో చూడాలని నాలుగో రోజు ఆట ముగిసాక మా వాళ్లతో చెప్పా. ఇక తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం దక్కిన జట్లు తమ మూడో ఇన్నింగ్సులో ధాటిగా ఆడతాయి. ఈ క్రమంలో భారత్ కు అడ్డుకట్ట వేయడంలో సఫలమయ్యాం. టెస్ట్ క్రికెట్ కు జీవం పోయాలని మాకు తెలుసు. గత ఐదు వారాలుగా మాకు లభిస్తున్న మద్దతు అద్భుతం. వచ్చే తరం తప్పకుండా టెస్ట్ క్రికెట్ ను ఆదరిస్తోంది అన్న నమ్మకం ఉంది”. అంటూ బెన్ స్టోక్స్ వివరించాడు.