భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లని విలీనం చేసి భారతీయ జనతా పార్టీ ఒక కొత్త దేశాన్ని సృష్టిస్తే తమ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను స్వాగతిస్తుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కరాచీ భారతదేశంలో భాగం అవుతుందని చెప్పినట్టుగానే భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను విలీనం చేయాలని మేము చెబుతున్నామని అన్నారు.
బెర్లిన్ గోడను పడగొట్టగలిగినప్పుడు భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను ఎందుకు కలపాలెం అని ఆయన ప్రశ్నించారు. ఈ మూడు దేశాలను విలీనం చేసి ఒకే దేశంగా మార్చాలని బిజెపి కోరుకుంటే, మేము దానిని ఖచ్చితంగా స్వాగతిస్తామని మాలిక్ అన్నారు. ఇక మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడి ప్రభుత్వంలో భాగమైన శివసేన, కాంగ్రెస్ లతో పాటు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్‌సిపి పోటీ చేయాలనుకుంటుందని మాలిక్ అన్నారు.