ప్రపంచ ఆహార ఉత్పత్తులో మనది మూడో స్థానం…!

-

గుజరాత్ లో మంగళవారం జరిగిన గ్లోబల్ పొటాటో కాన్‌‌క్లేవ్ లో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేసారు. రైతుల కష్టం, తమ ప్రభుత్వ విధానాల కారణంగా అత్యధిక ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న దేశాల్లో ప్రపంచ దేశాల్లో మన దేశం మూడో స్థానానికి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అదే విధంగా రైతుల కోసం చేసిన కార్యక్రమాలను వివరించారు.

దేశంలోని ఆరుకోట్ల మంది అన్నదాతల ఖాతాల్లోకి రూ.12 వేల కోట్ల నగదుని నేరుగా జమ చేసి ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసిందని మోడీ అన్నారు. ‘‘రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెండింతలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. రైతులు, ప్రభుత్వం ఉమ్మడి కృషి కారణంగా అత్యధిక ఆహార ధాన్యాలు, ఇతర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది.

ఈ నెల మొదట్లో ఆరు కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.12 వేల కోట్ల మేర జమచేయడం సరికొత్త రికార్డు అంటూ మోడీ వ్యాఖ్యానించారు. అదే విధంగా ఆయన ఈ ప్రసంగంలో వ్యవసాయ రంగం వృద్ది కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతులను ఆర్ధికంగా పరిపుష్టం చేసేందుకు గాను తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మోడీ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news