మహిళల ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం

భారత్ వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచ కప్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో పురుషుల వన్డే వరల్డ్ కప్‌తోపాటు 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ వేదిక కానున్నట్ల ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. అలాగే 2023-27 మహిళ క్రికెటర్ల మెగా ఈవెంట్ల షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. 2024లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 సిరీస్, 2025లో వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత మహిళ క్రికెట్ జట్టు
భారత మహిళ క్రికెట్ జట్టు

2026లో మరో టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లో జరగనుంది. అలాగే 2027లో శ్రీలంక వేదికగా తొలిసారి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి నిర్వహించనుంది. కాగా, ఐసీసీకి కొత్త చైర్మన్ రానున్నట్లు సమాచారం. 2022 నవంబర్‌లో నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీలో భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. ఇతనితోపాటు కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ, రోజర్ హార్పర్‌కు కమిటీలో సభ్యులుగా చోటు దక్కింది.