ఇండియా మరియు బంగ్లాదేశ్ మహిళల మధ్య జరుగుతున్న ఆఖరిది మరియు మూడవ టీ 20 లో హోస్ట్ లు గెలుపు దిశాగా ప్రయాణిస్తున్నారు. క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా మహిళలు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 102 పరుగులకే పరిమితం అయ్యారు. ఇండియా ఇన్నింగ్స్ లో కేవలం హర్మన్ ప్రీత్ కౌర్ ఒక్కరే అత్యధికంగా 40 పరుగులు చేసింది. మిగిలిన వారు అంత తక్కువ స్కోర్ లేక్ వెనుతిరిగారు. బంగ్లా బౌలర్లలో ఖాన్ మూడు మరియు సుల్తానా రెండు వికెట్లు దక్కించుకుంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళలు ఈ స్కోర్ ను చేధించే క్రమంలో ఇప్పటికే అయిదు వికెట్లను కోల్పోయింది. చివరి మూడు ఓవర్ లలో తక్కువ స్కోర్ చేయాల్సి ఉండగా.. గత మ్యాచ్ లో లాగా ఇండియా మహిళలు ఏమైనా అద్భుతం చేస్తారా అన్నది చూడాలి.
ఈ మ్యాచ్ లో కనుక ఇండియా ఓడిపోతే సిరీస్ 2 – 1 తో వశం అవుతుంది. లేదా గెలిస్తే 3 – 0 తో క్లీన్ స్వీప్ అవుతుంది. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.