మహిళల ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా మరో విక్టరీ సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్ , టీమ్ ఇండియా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో.. బ్యాటింగ్, బౌలింగ్లోనూ రాణించిన టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుపై ఏకంగా 110 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుతుంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. యస్టిక భాటియా మరోసారి 50 పరుగులు సాధించగా… ఓపెనర్లు స్మృతి మందన 30 పరుగులు, షఫాలి 42 పరుగులు చేశారు.
వీరికి పూజ వస్త్రాకర్, స్నేహ్ రాణా మద్దుతుగా నిలవడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 229 పరుగులు సాధించింది. రితుమోని రాణించి.. ఏకంగా మూడు వికెట్లు తీసింది. నహీదా అక్తర్ 2 వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా యస్టిక భాటియా ఎంపికైంది. అటు 229 పరుగుల ఛేజింగ్ కు దిగిన బంగ్లా దేశ్ చతికల పడింది. 40.3 ఓవర్లలోనే 119 పరుగుల చేసి.. బంగ్లా దేశ్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 110 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో.. టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా మారాయి.