Asia Cup 2022 : పసికూన హాంకాంగ్ పై టీమిండియా ఘనవిజయం..

-

 

ఆసియా కప్ లో ఇండియా దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిచిన టీమిండియా… బుధవారం హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లోను టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్… సూర్యకుమార్ మాస్ ఇన్నింగ్స్ తో చెలరేగడంతో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. నిర్నిత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని హాంగ్ కాంగ్ ముందు ఉంచింది. అయితే ఈ భారీ లక్ష్య చేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్.. పోరాడి ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఏకంగా 152 పరుగులు చేసి టీమ్ ఇండియాకు చుక్కలు చూపించింది.

 

ఇక అటు బౌలింగ్ లోను టీమిండియా బౌలర్లు బాగా రాణించారు. భువనేశ్వర్, హర్షదీప్ సింగ్, జడేజా, ఆవేష్ ఖాన్ తలో వికెట్ తీసి టీమిండియా కు విజయాన్ని అందించారు. దీంతో టీమిండియా 40 తేడాతో విజయం సాధించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news