బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త

-

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 51,270 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 47,000 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి .. రూ. 60,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news