మస్క్ చేతికి ట్విటర్.. కేంద్రం రియాక్షన్ ఏంటంటే..?

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. యాజమాన్యం మారినా చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​. “ఎవరు, ఏ సంస్థను కొన్నా ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. సామాజిక మాధ్యమాలన్నీ చట్టాలు, నిబంధనలను పాటించాలి. సంస్థలన్నింటికీ ఒకే నిబంధనలు ఉంటాయి” అని చెప్పారు.

మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను అనుమతిస్తానని మస్క్ చేసిన వ్యాఖ్యలపై అనేక మంది స్పందించారు. విద్వేషపూరిత ప్రసంగం, నిబంధనలు అతిక్రమించారన్న కారణంతో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ఖాతాను బ్యాన్ చేశారు. మస్క్ ప్రకటనతో ఆమె ఖాతాను పునరుద్ధరించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఇన్​స్టాలో ఓ అభిమాని చేసిన పోస్ట్​ను ఆమె షేర్ చేశారు.

ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థలో కీలక పదవుల్లో ఉన్న వారిపై అనూహ్యంగా వేటు వేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్​ఓ నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌, లీగల్‌ పాలసీ విభాగాధిపతి విజయ గద్దె సహా మరికొంత మందిని మస్క్‌ తొలగించారు.

Read more RELATED
Recommended to you

Latest news