ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌..!

-

ఇండియా టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచ చదరంగ చరిత్రలో అద్భుత విజయం నమోదు చేశారు. కొరకరాని కొయ్య లాంటి వరల్డ్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్ సన్ ను పదహారేళ్ల ప్రజ్ఞానంద కంగుతినిపించాడు. ఎయిర్ తింగ్స్ మాస్టర్స్ చెస్ టోర్నీలో ప్రజ్ఞా నంద ఎనిమిదో రౌండ్ పోరులో కార్ల్ సన్ ను ఓడించాడు. ఇది ఆన్లైన్ రాపిడ్ టోర్నమెంట్.

నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞా నంద 39 ఎత్తులోనే నార్వే దిగ్గజం కార్లసన్ ఆట కట్టించాడు. ఈ గేమ్ లో ప్రజ్ఞా నంద తరాష్ వేరియేషన్ ను ఎంచుకున్నాడు. మూడు వరుస విజయాలతో ఊపు మీదున్న కార్లసన్ ఈ పోరులో గెలవడం నల్లేరుపై నడక గా మారిందని చెస్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే భారత టీనేజర్ ప్రజ్ఞానంద మూలమైన మేధాశక్తితో కార్లసన్ జోరుకు కళ్లెం వేసాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 8 రౌండ్ల అనంతరం 8 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news