దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఒక్క మహారాష్ట్ర లోనే అత్యధికంగా 52 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణాలో 18, కర్ణాటకలో 15 కేసులు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. తెలంగాణాలో ఉన్న వారికి ఎవరికి కరోనా రాలేదు.
ఇది పక్కన పెడితే ఇండియాలో స్టార్ సింగర్ కి కరోనా వైరస్ సోకింది. ఈ మధ్యే లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్ కరోనా బారిన పడింది. బాలీవుడ్‌లో ఎన్నో హిట్ పాటలు పాడిన ఈమె బేబి డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి పాటలతో ఆమెకు బాగా పేరు వచ్చింది. కొన్ని రోజులుగా లండన్‌లో ఉన్న కనికా మార్చి 15న లక్నోకు వచ్చింది. లక్నో చేరుకున్న తర్వాత కనికా తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫైవ్ స్టార్ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చింది.
ప్రస్తుతం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమె పార్టీ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న నలుగురికి కరోనా వైరస్ సోకిందని అధికారులు గుర్తించారు. దానికి చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సామాజిక వేత్తలు కూడా హాజరైనట్లు సమాచారం. దీనితో వారు అందరిని గుర్తించే పనిలో పడింది యుపి ప్రభుత్వం.